ప్రజారోగ్యాన్ని పెంపొందిస్తూ.. సంక్షేమానికి పాటుపడటమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు స్థానిక పార్టీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ. 2 కోట్లు కేటాయించి.. తక్షణమే అందిస్తున్నామని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి.. కోట్లాది రూపాయల ఆర్థిక సాయం చేస్తోంని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: