ETV Bharat / state

Miss Telangana:  నిన్న "లైవ్​" లో ఉరేసుకోబోయింది.. ఈరోజు మున్నేరులో దూకింది..

హైదరాబాద్​లో నిన్నఇన్​స్టాలో "లైవ్​"లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన "మిస్​ తెలంగాణ" భవాని.. ఈరోజు కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో దూకింది. .

author img

By

Published : Oct 29, 2021, 7:20 PM IST

Updated : Oct 29, 2021, 9:57 PM IST

ఆత్మహత్య
ఆత్మహత్య
నిన్న "లైవ్​" లో ఉరేసుకోబోయింది.. ఈరోజు మున్నేరులో దూకింది..

జీవితంపై విరక్తితో హైదరాబాదులో నిన్న ఉరేసుకుని ఆత్మహత్యకుయత్నించిన మిస్​ తెలంగాణ మోడల్​ భవాని అలియాస్ హాసిని మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జిపైనుంచి మున్నేరులో దూకింది. స్థానికులు వెంటనే మున్నేరులో దూకి ఆమెను కాపాడారు. ప్రస్తుతం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

నిన్న ఏం జరిగింది..?
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్‌ హాసిని(21) హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోంది. ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్‌ తెలంగాణ’గా ఎంపికయ్యారు. హిమాయత్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్‌ చేస్తున్నారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్‌ (కాన్ఫరెన్స్‌) చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌లు చేస్తున్నా పట్టించుకోకుండా.. ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉన్నారు.

"ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్‌ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్‌ బై ఫర్‌ ఎవర్‌’’ అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్‌ను తన్నేశారామె.

ఇదంతా చూస్తున్న జగిత్యాలలోని ఆమె స్నేహితుడొకరు వెంటనే 100కు ఫోన్‌ చేశారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు శివప్రసాద్‌, మధు ఆగమేఘాలపై ఆమె ఉండే అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి అదృష్టవశాత్తు విడిపోవడంతో ఆమె మంచంపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న హాసినిని ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారని ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందులు కారణమని తెలిపినట్లు పోలీసు అధికారి రవికుమార్‌ చెప్పారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి హాసినిని తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి తీసుకెళ్లారు. ఆయితే.. ఈ పరిస్థితుల్లో ఆమె స్కూటీపై వచ్చి కీసర బ్రిడ్జి పై బండిని పెట్టి బ్రిడ్జిపై నుంచి మున్నేరులోకి దూకింది. గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. ఈ ఘటనపై కంచికచెర్ల పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: Suicide Attempt: మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అసలేమైంది?

Last Updated : Oct 29, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.