కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 2,200 మంది పేదలకు వైఎస్సార్ జగన్ అన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోం మంత్రి సుచరిత, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ స్వామినేని ఉదయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.... ముఖ్యమంత్రిగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని విమర్శించారు. నిరంతరం సర్వేలపైన ఆధారపడే చంద్రబాబు నాయుడు తన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో సర్వే చేయించుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక... ఎన్నికల్లో చేసిన హామీలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు.
ఇదీ చదవండి