ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు వలస కూలీలను తరలించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్‌కు వలస కూలీలతో వెళ్లే శ్రామిక రైలును ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక పస్తులుంటున్న కార్మికులకు భోజన, వసతి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు రాయనపాడు, విజయవాడ నుంచి 12 ప్రత్యేక శ్రామిక రైళ్లు, 143 బస్సుల ద్వారా ఇతర రాష్ట్రాల కూలీలను తరలించినట్లు చెప్పారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని... ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డంకులు కల్పిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి... 'మాకెందుకివ్వరూ పరిహారం'