ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు సరికాదని... దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు చోటులేదని, వైకాపా ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ నగర పర్యటనలో భాగంగా... మంత్రి వెల్లంపల్లి విజయవాడలోని స్వాతి థియేటర్ నుంచి యాత్ర నిర్వహించారు. తెదేపా హయాంలో నగరంలో అరాచక పాలన సాగిందని ధ్వజమెత్తారు. విజయవాడలో లక్ష కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల పట్టారు ఇచ్చారు తెలిపారు. 600 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశామని మంత్రి వివరించారు.
ఇదీ చదవండీ.. 'విశాఖ ఉక్కు కర్మాగారంపై తుక్కు అనే ముద్ర వేసి అమ్మాలని చూస్తున్నారు'