కరోనాతో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఇద్దరు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యోగుల మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మూడో బ్లాక్‌లోని తన చాంబర్‌లో మంత్రి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. కొవిడ్ నేపథ్యంలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని.. విజ్ఞప్తి చేశారు. మరోవైపు సచివాలయంలోని మంత్రి ఛాంబర్ వద్ద.. మైనింగ్ కేసులకు సంబంధించిన విచారణను ఇవాళ చేపట్టారు. ఈ కేసుల విచారణకు మంత్రి ఛాంబర్ వద్ద.. వందల మంది హాజరు కావడంతో.. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి ఉండి ఇంతమందిని సచివాలయంలోకి అనుమతించటంపై.. ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి...: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి