ETV Bharat / state

Peddireddy on Party Issues: అలా ఎవరైనా చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Jan 4, 2022, 11:28 AM IST

Peddireddy on Party Issues: వచ్చే ఎన్నికల్లో సైతం మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదే పార్టీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్​కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టేనని వైకాపా నేతలకు తేల్చిచెప్పారు.

Peddireddy on Party Issues
Peddireddy on Party Issues

Peddireddy on Party Issues: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్​ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో సైతం... పార్టీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్​కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టేనని వైకాపా నేతలకు తేల్చిచెప్పారు. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్ అక్కడే కొనసాగుతారని తెలిపారు. అనవసరంగా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని చెప్పారు. అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు సైతం వెనుకాడమని పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అనవసర వివాదాలకు దారితీసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: MANYAM TEMPARATURE: మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.