కృష్ణా జిల్లా మచిలీపట్నం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనాన్ని స్వయంగా నడుపుతూ సున్నిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు మంత్రి పేర్ని నాని పలు సూచనలు చేశారు. ఆ తరువాత బెరాక మినిస్ట్రీస్ తలపెట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సుమారు 300 మంది పేద ప్రజలకు నిత్యావసరాలు అందజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు