ETV Bharat / state

బాపు మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి - bapu museum news

ఎంతో ప్రాముఖ్యత ఉన్న విజయవాడ బాపు మ్యూజియాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. అపురూపమైన ఈ సంపదను భద్రపరిచి, పరిరక్షించి భావితరాల వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

minister mutthamshetti
బాపు మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి
author img

By

Published : Aug 20, 2020, 10:10 AM IST

విజయవాడలోని బాపు మ్యూజియాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. మ్యూజియం ప్రాంగణంలోని భవనంలో ఏర్పాటు చేసిన అడ్వాన్సుడు డిజిటల్ డిస్ ప్లే టెక్నాలజీ ద్వారా ఉంచిన వివిధ శిల్పాలు, కళాఖండాలను పరిశీలించారు.

విజయవాడలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాపు మ్యూజియాన్ని ఆధునికీకరించారు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేస్తే శిల్పాలు, చిత్రాలు వాటి చరిత్రను తెలియజేసేలా ఆగ్యుమెంట్‌ టెక్నాలజీని అనుసంధానించారు. త్వరలో ఈ మ్యూజియం ప్రారంభించేందుకు రాష్ట్ర పురావస్తు, పర్యాటకశాఖలు సన్నాహాలు చేస్తున్నాయి.

విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న బాపు మ్యూజియానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో అరుదైన, విలువైన పురాతన, శిలా సంపద ఇక్కడ పదిలపరిచారు. ఈ మ్యూజియంను 1887లో విక్టోరియా మ్యూజియం పేరుతో ఏర్పాటు చేశారు. 1921 లో ఇక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీజీకి అందజేశారు. మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అపురూపమైన ఈ సంపదను భద్రపరిచి పరిరక్షించి భావి తరాల వారికి అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి ‌ అభిప్రాయపడ్డారు.

మొత్తం 13 కోట్ల రూపాయల వరకు ఆధనికీకరణ కోసం ఖర్చు చేశారు. పురావస్తు శాఖ కమీషనరు వాణీమోహన్‌, ఇతర సిబ్బంది ఈ బాపు మ్యూజియం అభివృద్ధిపై ప్రత్యేక చూపారని మంత్రి ప్రశంసించారు. ఇందులో అరుదైన వివిధ రకాల 1500 పురాతన వస్తువులు ఉన్నాయి. లక్ష సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా నిలిచే పురావస్తు సంపదను ఈ మ్యూజియంలోని ఏడు గ్యాలరీలలో భద్రపరిచారు. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఉపయోగించిన వివిధ పురాతన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు ఇక్కడ ఉంచారు.

ఇదీ చదవండి: జగ్గయ్యపేటలో గుట్కా స్వాధీనం..నిందితుల్లో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.