పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని మంత్రి కొడాలి నాని, ఎస్పీ రవీంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ప్రతిఏటా నిర్వహించే పోలీసు అమరవీరుల వారోత్సవాలలో అనేక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మంత్రి కొడాలి అన్నారు. పోలీసు అమరుల జ్ఞాపకాలతో అక్టోబరు నెలలో వారోత్సవాలు చేయటం,వారి కర్తవ్యాలను, త్యాగాలను విద్యార్థులకు తెలియచేయటం జరుగుతుందని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు వివరించారు.
ఇదీచూడండి.పోలీసులది ఖాకీ కులమే..!