రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు.. మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన ఈ విషయమై మాట్లాడురు.
న్యాయస్థానాల్లో స్టేటస్‌కో ఉండటం వల్లే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగడం లేదని చెప్పారు. తొందర్లోనే న్యాయ చిక్కులన్నీ అధిగమించి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల స్థలాలు అందిస్తామని మంత్రి నాని తెలిపారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేని చోట.. రాజధానిని ప్రకటించడం పద్ధతి కాదని సీఎంకు చెప్పినట్లు కొడాలి నాని అన్నారు. 29 గ్రామల సమస్యను పట్టుకుని.. రాష్ట్రం అతలాకుతలం అయినట్లుగా తెదేపా ప్రవర్తిస్తోందని కొడాలి నాని అన్నారు.
ఇదీ చదవండి: