ఉల్లి ధరపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఈ సమస్య దేశ వ్యాప్తంగా ఉందని... రాష్ట్రానికే పరిమితం కాలేదని సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్అవగాహనతో మాట్లాడాలని హితవుపలికారు. చంద్రబాబు అమరావతిలో పర్యటించినప్పుడు రైతులే నిరసన తెలిపారని... మంత్రి కొడాలి పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమ పర్యటనలో దాడులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. రైతుల భూములు తీసుకున్నందుకే అలా చేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు గుర్తించే... వైకాపాకు 151 సీట్లు ఇచ్చారని... జనసేనకు ఒక స్థానం మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ఉల్లి ధరలు తగ్గించండి... ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి