Harish Rao on Job Notification: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూపు 4 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శారీరక దృఢత్వ శిక్షణను పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు పాలు, పండ్లును పంపిణీ చేశారు. తెలంగాణలో ఇప్పటికే 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఆ శాఖలోనే మరో 2 వేల పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్‌రావు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ ఆర్మీ నియామకాలకు యువత ముందుకు రావడం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 4 ఏళ్ళ కాంట్రాక్ట్‌తో ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్రం వైఫల్యమైందంటూ దుయ్యబట్టారు. ఉద్యోగం తర్వాత భద్రత కోసం పింఛను సైతం లేదన్నారు. గ్రూపు 4 ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని హరీశ్‌రావు వెల్లడించారు.
వారి టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ని ఎంత బలవంతుడ్ని చేసుంటాయి.. : ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న హరీశ్ రావు.. మరి భాజపా నేతలు టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ని ఎంత బలవంతుడ్ని చేసి ఉంటాయని చమత్కరించారు. పీఎంగా దేశానికి, తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏం చేశారని ప్రశ్నిస్తే తిడుతున్నారని చెబుతూ... పలాయనం చిత్తగించడం ఎంత వరకు భావ్యం మోదీజీ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: