ఆగస్టు 15న లబ్ధిదారులకు ఇంటిస్థలాలు కేటాయిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 30 లక్షల మందికి ఇంటిస్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆయన వివరించారు. ఇంటిస్థలాల కోసం ఇప్పటివరకు 22,068 ఎకరాలు సేకరించామని మంత్రి తెలిపారు.
ఇంటిస్థలం పట్టాను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వటం తప్పా అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో మొత్తం 6.2 లక్షల ఇళ్లు తలపెట్టారని... ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని ఆయన వివరించారు. తెదేపా హయాంలో ఎంపికైన గృహలబ్ధిదారులకు... డబ్బులు చెల్లించకుండా ఆ ఇళ్లను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు: మంత్రి బొత్స