జనవరి 9వ తేదీన 'జగనన్న అమ్మఒడి' రెండో విడత చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిని పొందేందుకు ఈనెల 20 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 16-19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శిస్తామని... 26న అమ్మ ఒడి లబ్ధిదారుల చివరి జాబితా ప్రకటిస్తామని అన్నారు. ఈనెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం తీసుకుంటామని వివరించారు.
మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేస్తున్నామని మంత్రి సురేష్ అన్నారు. నాలుగు కేటగిరీలుగా విభజించి.. పద్దతి ప్రకారమే బదిలీల ప్రక్రియ చేపడుతున్నామని వివరించారు. ఒకేచోట ఐదేళ్లు, ఆపై సర్వీసు పూర్తి చేసిన టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి 60 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు బదిలీలలో పారదర్శకత కోసమే పోస్టులను బ్లాక్ చేశామని మంత్రి స్పష్టం చేశారు. వాటి వివరాలు కావాలంటే ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి
సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ సమయం ఇవ్వలేం: హైకోర్టు