ETV Bharat / state

ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపాలి: మంత్రి పెద్దిరెడ్డి - భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్తలు

రాష్ట్రంలో ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపాలని.... పంచాయతీరాజ్‌, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఏపీఎండీసీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

mines minister peddireddy review meeting on sand
ఇసుక అక్రమరవాణాపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
author img

By

Published : Feb 19, 2020, 6:12 AM IST

ఇసుక నూతన పాలసీ, డోర్‌ డెలివరీ విధానంపై సంబంధిత అధికారులతో భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో సమీక్షసమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 380 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, మరో వంద మొబైల్‌ చెకింగ్‌ పార్టీలను నిర్వహిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక నిజమైన వినియోగదారుడికి మాత్రమే అందాలని... దానికి భిన్నంగా జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జీపీఎస్ అనుసంధానం ద్వారా ఇసుక విక్రయాలు, రవాణాలో అక్రమాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా తయారు చేయాలన్న మంత్రి... మొబైల్‌ బృందాల పనితీరును ఈ యాప్‌ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డోర్‌డెలివరీ విధానం ద్వారా కృష్ణా జిల్లాలో 96శాతం వరకు వినియోగదారులకు ఇసుకను అందజేస్తున్నామని అధికారులు వివరించగా... దానిని 100శాతానికి తీసుకురావాలని ఆయన సూచించారు. పెరుగుతున్న అవసరాలకు సరిపడా రీచ్‌ల వద్ద ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

ఇసుక అక్రమరవాణాపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ఇదీ చదవండి: 'జీఎస్టీ రిటర్ను దాఖలు ఇప్పుడు మరింత సులభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.