ETV Bharat / state

ప్రాథమిక విద్యలో సంస్కరణలపై.. నేడు కీలక సమావేశం

ప్రాథమిక విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై నేడు కీలక సమావేశం జరగనుంది. ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో కలపడం పేద పిల్లల చదువులపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

meeting on elementary education at thursday
ప్రాథమిక విద్యలో సంస్కరణలపై నేడు చర్చ
author img

By

Published : Jun 17, 2021, 10:34 AM IST

ప్రాథమిక విద్యలో సంస్కరణలపై నేడు చర్చ

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5+3+3+4 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషనల్‌ బడులుగా మార్పు చేస్తారు. అంగన్‌వాడీలు వైఎస్సార్‌ ప్రీప్రైమరీ పాఠశాలలుగా మారతాయి. ప్రాథమిక బడులకు సమీపంలో ఉన్న అంగన్‌వాడీలను పాఠశాలల్లో కలిపేసి, ప్రీప్రైమరీ-1, 2, ఒకటో తరగతికి సన్నద్ధత, ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తారు.

ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తారు. దీంతో వీరందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సెకండరీ పాఠశాల 3 కిలోమీటర్లలో ఉంటుందని ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాల కిలోమీటరు, ప్రాథమికోన్నత బడి మూడు, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇందుకు విరుద్ధంగా 3, 4, 5 తరగతులు చదివే వారిని మూడు కిలోమీటర్ల వరకు పంపించడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కోటితీర్థం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 31మంది ఉండగా3,4,5 తరగతులు చదివేవారు 17మంది ఉన్నారు. కొత్త విధానం ప్రకారం వీరు ఐదు కిలోమీటర్ల దూరంలోని జిల్లాపరిషత్తు టీకేపాడుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు పాఠశాలను మరింత దూరం పెంచుతుంది. ఈ మండలంలోని 52 పాఠశాలలను మార్పు చేయడం వల్ల అర్థ కిలోమీటరు నుంచి.. 6కిలోమీటర్ల దూరం పెరగనుంది.

వాకాడు మండలంలో కొన్నిచోట్ల 10, 12, 15కిలోమీటర్లు దూరం ఉంది. ఇలాంటి ఉదాహరణలే గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఉన్నాయి. సంస్కరణలపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. ప్రాథమిక పాఠశాలలోనే ప్రీప్రైమరీ నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహిస్తే బాగుంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయమై విద్యావేత్తలతో మంత్రి చర్చించనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు... మద్యం, బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.