కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో కరోనా కలకలం రేపింది. డిసెంబర్లో విజయవాడ నుంచి పుట్టింటికి ప్రసవానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. తరుచూ భార్యను పలకరించడానికి ఆమె భర్త విజయవాడ నుంచి చంద్రాల వచ్చేవాడు. మహిళకు పురిటి నొప్పులు రావటంతో ప్రసవం కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా నూజివీడులో ట్రూనాట్ టెస్ట్‌లో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే వైద్యులు అక్కడి నుంచి ప్రసవం కోసం మహిళను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపించగా... అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా నిర్థారణ పరీక్షలు రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు చంద్రాలలో శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు.
కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
కృష్ణా జిల్లా చంద్రాలలో కరోనా సోకిన గర్భిణి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో కరోనా కలకలం రేపింది. డిసెంబర్లో విజయవాడ నుంచి పుట్టింటికి ప్రసవానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. తరుచూ భార్యను పలకరించడానికి ఆమె భర్త విజయవాడ నుంచి చంద్రాల వచ్చేవాడు. మహిళకు పురిటి నొప్పులు రావటంతో ప్రసవం కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా నూజివీడులో ట్రూనాట్ టెస్ట్‌లో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే వైద్యులు అక్కడి నుంచి ప్రసవం కోసం మహిళను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపించగా... అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా నిర్థారణ పరీక్షలు రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు చంద్రాలలో శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 10,667 కేసులు.. 380 మరణాలు