కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే సుజాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో కొంత కాలంగా వివాదాలు కొనసాగడం వల్ల మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...
ఈ - క్రాప్‌తో రైతులకు న్యాయం జరుగుతుంది: వ్యవసాయ శాఖ కమిషనర్