కృష్ణాజిల్లా మైలవరం మండలం వెల్వడంలో బాల కోటేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు కోనేరు వద్ద పుణ్యస్నానాలు చేసి.... పితృ దేవతలకు తర్పణాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్వామిని దర్శించుకుంటున్నారు. పండుగ సందర్భంగా మూడు రోజులు సాగే ఉత్సవాలలో గొర్రె పోటేళ్ల బండ్లతో భక్తులు ఏర్పాటు చేసే ప్రభలు అలరిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీతో పాటు ప్రభుత్వ అధికారులూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: దివిసీమలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు