ETV Bharat / state

మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్‌ చేసిన కామాటి సస్పెన్షన్‌

మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో లంచం డిమాండ్‌ చేసిన కామాటిపై సస్పెన్షన్ వేటు పడింది. అశ్వనీకుమార్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి నిర్ణయం తీసుకున్నారు.

machilipatnam-district-hospital-kamati-suspended-for-accuse-in-bride
లంచం డిమాండ్‌ చేసిన కామాటి సస్పెన్షన్‌
author img

By

Published : Aug 25, 2020, 3:37 PM IST

మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో మృతదేహం అప్పగించేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన కామాటి అశ్వనీకుమార్‌ సస్పెన్షన్​కు గురయ్యారు. మీడియాలో ప్రసారమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్... ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

లంచం డిమాండ్‌ చేసిన కామాటి సస్పెన్షన్‌

ఓ మహిళ మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు కామాటి అశ్వనీకుమార్‌ రూ. 6 వేలు డిమాండ్​ చేసి... చివరకు రూ. 1500 నగదు తీసుకున్నాడు. మృతదేహాన్ని ఇచ్చేందుకు నగదు తీసుకోవటం హేయమైన చర్య అని.. అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల కలెక్టర్​ చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులకు ఉచిత రేషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.