కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం జయపురం గ్రామంలో ఓ ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నాలుగు రోజుల కిందటే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు గుడిసేవ రాహుల్ (18), మృతురాలు రాజులపాటి హారిక (17)గా గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :