జగన్ అధికార దాహం తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత ప్రాణాలను బలి తీసుకుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం జడ్పీటీసీ తెలుగుదేశం అభ్యర్థి పారా హైమారావు గుండెపోటు మరణించారని... నామినేషన్ ఉపసంహరణకు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఒత్తిడే ఇందుకు కారణమని ఆరోపించారు. ఇతర తెలుగుదేశం ఎంపీటీసీలపైనా వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
ప్రత్యర్థిని పోటీలో లేకుండా చేయాలనుకుంటున్నారంటే... జగన్ లో గెలుస్తామన్న దీమా లేదన్నది సుస్పష్టమవుతోందని లోకేశ్ ట్వీట్ చేశారు. వైకాపాకు పోటీ చేసే ఛేవ చచ్చిందని అర్థమవుతోందన్నారు. దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటున్నారని... ఇలాంటి పిరికితనానికి వైకాపా సిగ్గుపడాలని అన్నారు. అధికార నైజం మార్చుకోకుంటే, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెదేపాకు తెలుసునని హెచ్చరించారు.
ఇవీ చదవండి: