పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన... 33వేల ఎకరాల్లో పసుపును సాగు చేయగా 8.25 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారని పేర్కొన్నారు.
కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారన్న లోకేశ్ ప్రభుత్వం పసుపు క్వింటాలుకు 6 వేల 8 వందల 50 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు క్వింటా 15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైకాపా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
ఇవీ చదవండి