చంద్రబాబు యాత్రను విశాఖలో వైకాపా అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు, ప్రతిపక్షనేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారని ధ్వజమెత్తారు. వైకాపా డీఎన్ఏలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయన్నారు. జగన్మోహన్రెడ్డి విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించిందన్నారు. ప్రతిపక్షనేతపై ఈ రోజు గుడ్లు, టొమేటోలు వేయించారని.... రేపు ప్రజలపై బాంబులు, కత్తులతో దాడులకు దిగుతారని ట్విట్టర్‌లో తెలిపారు.