కృష్టా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని భారత్ టాకీస్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. డ్రైనేజీ నిర్మాణం కోసం రహదారి పక్కన నిర్మాణాల తొలగింపునకు అధికారులు ప్రయత్నించారు. ప్రొక్లెయిన్‌తో ఇల్లు తొలగిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తి ప్రొక్లెయిన్‌కు అడ్డుగా రహదారిపై పడుకుని నిరసన తెలిపాడు. మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నంచగా.. స్థానికులు అడ్డుకున్నారు.
తాము ఎన్నో ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నామని.. ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే ఎటువెళ్లాలని స్థానికులు.. అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కేటాయించిన తర్వాతే తొలగింపు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.