కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం మెరక (లోతు ప్రాంతాల ఎత్తు పెంచటం) పనులు చేపడుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం కొంత వరకు మాత్రమే మట్టిని మెరకుకు ఉపయోగిస్తున్నారని.. మిగతాది అర్థరాత్రి సమయంలో అక్రమంగా బయటకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మట్టి దోపిడీ, అక్రమ విక్రయాలపై, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని విమర్శించారు. పంచాయతీ ఈవోని వివరణ కోరగా ఆమె సెలవులో ఉన్నట్టు తెలియజేశారు. ఈనెల ఏడో తేదీన ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ.. Vaccination: ఆధార్ లేకుండానే వృద్ధులకు టీకా.. ప్రభుత్వం నిర్ణయం