ETV Bharat / state

తెలంగాణ: సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం! - తెలంగాణ ఉప్పల్ ఎమ్మెల్యే వార్తలు

భారీ వర్షాల కారణంగా భాగ్యనగరం అతలాకుతలమైంది. ముఖ్యమైన ప్రాంతాలతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అలా ఓ కాలనీవాసులను పరామర్శించేందుకు వెళ్లిన తెలంగాణలోని ఓ ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు షాక్ ఇచ్చారు.

women blocked  uppal mla at telengana
ఉప్పల్ ఎమ్మెల్యేను అడ్డుకున్న మహిళలు
author img

By

Published : Oct 15, 2020, 5:23 PM IST

ఉప్పల్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

హైదరాబాద్ ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి పర్యటనను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వరదలు వచ్చినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అతివలు... ఎమ్మెల్యేపై మండిపడ్డారు. తమకు ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీశారు.

సహాయక చర్యలు తీసుకోకపోతే మీ పేరు రాసి చ‌నిపోతామంటూ బెదిరించారు. మేం బతకాలా? చావాలా అంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులను ముఖం పట్టుకుని నిలదీశారు. చేసేదేం లేక వారు వెనుదిరిగారు.

ఇదీ చదవండి: ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.