ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

ఏపీలో మద్యం ధరలు పెరిగిన కారణంగా.. కొందరు తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు పోలసులు సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్నారు. వేర్వేరు చోట్ల వాహనాల్లో తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. వాహనాలు సీజ్​ చేశారు.

liquor botles seized in telangana borders regions of krishna district
మద్యం బాటిళ్లు సీజ్​ చేసిన అధికారులు
author img

By

Published : May 25, 2020, 2:56 PM IST

విజయవాడ నగర శివార్లలో వాహనంలో తరలిస్తున్న 223 మద్యం బాటిళ్ళను నున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం నుంచి కారులో అక్రమంగా విజయవాడ వైపు మద్యం బాటిళ్ళతో వస్తున్న కారుని సూరంపల్లి రామచంద్రాపురం అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీ చేయగా బాటిళ్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని, రవాణా చేస్తున్న కారును సీజ్ చేశామని నున్న గ్రామీణ పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 271 మద్యం బాటిళ్లను మైలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీను, ఎస్సై ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడి చేసి అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబుతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్​మెంట్ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ అదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

మద్యం దుకాణాల ముందు కనిపించని భౌతిక దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.