తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కొత్తబస్టాండ్ పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. బస్టాండ్ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు స్థానికుల వెల్లడించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతకోసం గాలించారు. దాదాపు రెండు గంటలకు పైగా వెతికినా ఆచూకి లభించలేదు. చిరుత సంచారంపై సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అయితే అడవి పిల్లి అయి ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను చూశామని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు