ETV Bharat / state

'బలహీనవర్గాలపై దాడుల పట్ల సీఎం స్పందించకపోవటం దారుణం' - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధర్నా

బడుగు, బలహీనవర్గాలపై దాడుల పట్ల రాష్ట్రపతి స్పందించినా... సీఎం స్పందించకపోవడం దారుణమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

leftist parties darna in  vijayawada
బలహీనవర్గాలపై దాడుల పట్ల సీఎం స్పందించకపోవటం దారుణం
author img

By

Published : Aug 17, 2020, 3:15 PM IST

బడుగు, బలహీనవర్గాలపై దాడుల పట్ల రాష్ట్రపతి స్పందించినా... సీఎం స్పందించకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు ధర్నా చేపట్టారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్​లో బలహీన వర్గానికి చెందిన యువకుడికి శిరోముండనం చేశారు. ఘటనపై రాష్ట్రపతి స్పందించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. దాడులకు తెగబడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. లేదంటే బాధితులతో రాష్ట్ర స్థాయి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వీడియో రికార్డింగ్​తో రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.