ETV Bharat / state

జాతీయ సమ్మెను విజయవంతం చేయండి.. నేతల పిలుపు

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 26, 27న చేపట్టనున్న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడటానికి ప్రజలు సిద్ధం కావాలని కోరారు. 26న సార్వత్రిక సమ్మె, 27న గ్రామీణ ప్రాంత రైతుల సదస్సులు చేపట్టేందుకు పూర్తి మద్దతు కూడగడుతున్నారు. వివిధ ప్రణాళికలు రచిస్తూ నిరసనను తెలియజేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Leaders call for a successful national strike
సమ్మెను విజయవంతం చేయాలని నేతల పిలుపు
author img

By

Published : Nov 22, 2020, 9:45 PM IST

కేంద్రానికి వ్యతిరేకంగా ఈనెల 26, 27న చేపట్టనున్న జాతీయ సమ్మెకు కులవివక్ష పోరాట సమితి నాయకులు మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కీలక రంగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా చర్యలు చేపడుతున్నారని వామపక్ష పార్టీ నాయకులు శ్రీనివాసరావు అన్నారు. అదే జరిగితే రిజర్వేషన్లు కోల్పోయి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులను కాలరాసి, మను వాదాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ, గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకై ప్రజలు సమ్మెలో పాల్గొనాలని కోరారు.

చిత్తూరులో...

రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రైతుకూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దమండ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 26, 27న దిల్లీలో తలపెట్టనున్న నిరసన ప్రదర్శనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా రైతు సదస్సులు చేపడతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా ఆర్యవైశ్య సమ్మేళనాన్ని అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.