ETV Bharat / state

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే - భూముల రీసర్వే ఏపీ తాజా

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి... మంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌, పేర్ని నాని ఈ సర్వేను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో చేపడుతున్న సర్వేతో భూముల వివాదాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మంత్రులు తెలిపారు.

lands reservey
భూముల రీసర్వే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం
author img

By

Published : Feb 18, 2020, 11:03 PM IST

భూముల రీసర్వే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం

భూ వివాదాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి సర్వేకు శ్రీకారం చుట్టారు. తక్కెళ్లపాడు గ్రామంలో భూ సర్వేను రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, రవాణా శాఖ మంత్రి పేర్నినాని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేట తహసీల్దార్‌ కార్యాలయంలో కార్స్‌ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం మంత్రులు ప్రారంభించారు. ఈ మండలంలో లోటుపాట్లను సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు. మండలంలోని 25 గ్రామాల పరిధిలో 66 వేల 761 ఎకరాల భూములను రీ సర్వే చేయనున్నారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర రికార్డులు తయారు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 31 లక్షల ఎకరాల భూమిని రీసర్వే చేయనున్నారు. రెండేళ్లలో ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి సుభాష్​ చంద్రబోస్​ తెలిపారు.

ఆన్‌లైన్‌లో మ్యాప్‌తో సహా వివరాలు...

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను కొలవనున్నట్లు సర్వే శాఖ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భూ యజమానులకు సమగ్ర యాజమాన్య హక్కులు కల్పించడమే భూముల రీసర్వే ముఖ్య ఉద్దేశమన్నారు. శాటిలైట్, జీపీఎస్, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే కార్స్‌ టెక్నాలజీ వినియోగించి పక్కాగా భూములు రీసర్వే చేస్తామన్నారు. భూముల హద్దులను కంప్యూటర్ సాయంతో పకడ్బందీగా రికార్డులు తయారుచేస్తామన్నారు. రీసర్వే తర్వాత ఆన్‌లైన్‌లో మ్యాప్‌తో సహా సెల్​ఫోన్‌లోనే పొలం హద్దులు, వివరాలు తెలుసుకోవచ్చన్నారు. బ్రిటీష్ వారి హయాంలో చేసిన సర్వే రికార్డులను పోల్చుతూ ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త రికార్డులు తయారు చేయనున్నారు.

ఇవీ చూడండి:

దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.