రాష్ట్రంలో కరోనా మృతులపట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషమని తెదేపా అధికార ప్రతినిధి కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని ప్రొక్లెయిన్‌తో ఈడ్చుకెళ్లిన ఘటన మానవ సంబందాలకు, సాంప్రదాయాలకు మాయనిమచ్చ అని మండిపడ్డారు.
కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించటం సిగ్గుచేటని విమర్శించారు. ఐసోలేషన్ వార్లుల్లో, క్యారంటైన్ కేంద్రాల్లో రోగులకు, డాక్టర్లకు, నర్సులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిని వేధించటంపైన జగన్ పెట్టిన శ్రద్ధ కరోనా నివారణపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. పలాసలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి