ఆంధ్రప్రదేశ్‌కు 3.5 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య సంస్థ తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నీటి విడుదలకు పచ్చజెండా ఊపినట్లు అధికారులు తెలిపారు. మార్చి రెండో వారంలో నీళ్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏటా ఏప్రిల్‌లో విడుదలయ్యే జలాలు ఈ సంవత్సరం ముందుగానే విడుదలకానున్నాయి.
చెరువుల్లోకి 'నీళ్లు'
అధికారుల అంచనా ప్రకారం పశ్చిమ కృష్ణాలోని సాగర్ కాలువ పరిధిలో 260 చెరువుల్లో90 శాతం చెరువులు ఎండిపోయాయి. ఆ ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైభూగర్భజలాలూఅడుగంటాయి. చెరువులను నింపి తాగునీటి సమస్యనుఅధిగమించే ఉద్దేశంతో.. నీటిని విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కృష్ణా నది యాజమాన్య సంస్థకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన యాజమాన్య సంస్థ... మార్చిలోనే నీటి విడుదలకు అంగీకరించింది.