కృష్ణా జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటుచేసి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 21న మచిలీపట్నంలో స్వర్ణోత్సవాలు(Golden Jubilee) నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచందు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురికి ప్రతిభా పురస్కారాలను ప్రదానంచేస్తామని వెల్లడించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటారన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ సంచికను స్వాతి వారపత్రిక సంపాదకుడు బలరాం, తెలుగుభాష కథా గ్రంథాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
వివిధ పురస్కారాలు పొందిన వారి వివరాలిలా..
మండలి వెంకట కృష్ణారావు భాషా సేవా పురస్కారం: మానుకొండ నాగేశ్వరరావు, ఆచార్య ఆర్.వి.ఎస్. సుందరం
సాహిత్య ప్రతిభా పురస్కారం: ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్
గుత్తికొండ సుబ్బారావు సాహిత్య సేవా పురస్కారం: రసరాజు, ఆచార్య శిఖామణి
ముక్కామల నాగభూషణం పాత్రికేయ ప్రతిభా పురస్కారం: యాబలూరి సీతారామశర్మ, సామల రమేష్‌బాబు
పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య ప్రతిభా పురస్కారం: ఆచార్య ఈమని శివనాగిరెడ్డి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి
వేములపల్లి కేశవరావు అనువాద ప్రతిభా పురస్కారం: ఎల్.ఆర్.స్వామి, గౌరీ కృపానందన్
ఇదీ చదవండి:
ELECTION CAMPAIGN: జోరుగా ప్రచారం..ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన