ETV Bharat / state

అమెరికాలో దోపిడీ దొంగల కాల్పులు.. కృష్ణా జిల్లా యువకుడు మృతి - అమెరికా కాల్పుల్లో కృష్ణా జిల్లా వాసి సత్యకృష్ణ మృతి

Telugu student death in America: అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో.. కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన యువకుడు మరణించాడు. ఉన్నత చదువుల కోసమని అమెరికాకు వెళ్లిన తమ కుమారుడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సత్యకృష్ణ మృతదేహాన్ని.. స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

krishna district student death in america due to robbery violence
అమెరికాలో దోపిడీ దొంగల కాల్పులు
author img

By

Published : Feb 13, 2022, 8:45 PM IST

Telugu student death in america: అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువకుడు చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని.. స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరి సత్యకృష్ణ ఉన్నత విద్య కోసం గత నెల అమెరికాకు వెళ్లారు. అక్కడి అలబామా రాష్ట్రంలో ఓ స్టోర్స్ దుకాణంలో ఉద్యోగంలో చేరాడు. ఆయన పనిచేస్తున్న దుకాణంలో దోపిడీ దొంగలు కాల్పులకు తెగబడ్డారు.

ఆ కాల్పుల్లో సత్యకృష్ణ మృతి చెందినట్లు కాలిఫోర్నియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు సాగర్ తెలిపారు. చదువుకునేందుకు వెళ్లిన తన కుమారుడు తిరిగిరాని లోకాలకు చేరడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కార్మికుల ‘జైల్‌ భరో’.. కార్మికుల అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.