Krishna district SP on liqueur: నాటు సారా తయారీ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు శాఖ, సెబ్‌తో కృష్ణా జిల్లా ఎస్పీ సంయుక్త సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ ఆనవాళ్లు జిల్లాలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిత్యం నాటుసారా తయారీ, విక్రయానికి పాల్పడినట్లు తేలితే.. వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచించారు. ఎంతో మంది జీవితాలను కాలరాస్తున్న నాటుసారా ఆనవాళ్లు జిల్లాలో ఏ మూలనా కనిపించకూడదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు.
Krishna district SP on liqueur: జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో నాటుసారా తయారీపై అధిక కేసులు ఏ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి..? ఆ ప్రాంతాల్లో ఎంత మంది తయారీదారులు ఉన్నారు? అనే విషయాలను ఎస్పీ ఇరు శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా నాటుసారా తయారీదారులపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, రహస్యంగా నాటు సారా తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయాలని చెప్పారు. అలాంటి ప్రాంతాలన్నిటిపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగంటే ఎక్కువ కేసులుంటే వారిపై పీడీ యాక్ట్‌ను అమలు చేసేలా నివేదికలు తయారు చేయాలన్నారు.
Krishna district SP on liqueur: అక్రమ మార్గాల ద్వారా నాటు సారా రవాణా చేసే ప్రాంతాలను గుర్తించి నిరంతర తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ స్టేషన్లలో కూడా నాటు సారా తయారీపై నమోదైన కేసులను గమనించి అధిక కేసుల్లో ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్లు తెరవాలని అన్నారు. ఇకపై ఇరు శాఖలతో నిరంతరం సమావేశాలు జరుగుతుంటాయని ఎప్పటికప్పుడు పురోగతిని తెలపాలని, సారా కట్టడిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: VOA Nagalakshmi suicide : ఆమె ఆత్మహత్య చేసుకుంటే గానీ.. నిందితుడి అరెస్టు లేదు!