కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఇసుక సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సారథి... ఇసుక పంపిణీ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటోందని... ఆలస్యమైన విషయం వాస్తవమేనని అన్నారు. వీలైనంత త్వరగా కార్యాచరణ రూపొందించి... వారం రోజుల్లో ఇసుక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి