కోలుకున్న పలువురు విద్యార్థినులను తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు తీసుకెళ్లగా.. ఆందోళనకరంగా ఉన్న తొమ్మిది మందిని ఆటోల ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి సకాలంలో వైద్యం అందించారు. విద్యార్థినులు కోలుకోవడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉపాధ్యాయులపై మండిపాటు..: విద్యార్థినులను సంరక్షించాల్సిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వ్యవహారశైలిపై పలువురు మండిపడుతున్నారు. ఒక్కసారిగా ఒత్తిడికి గురవడం, బాడీ డీహైడ్రేషన్ కారణంగానే విద్యార్థులంతా అస్వస్థకు గురయ్యారని డాక్టర్ జయ శ్రీ స్పష్టం చేశారు. పాఠశాలలో జరిగిన కలకలంపై గుడివాడ ఆర్డిఓ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ నిర్వహిస్తామని, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుడివాడ తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు
తెదేపా నేత పరామర్శ: అస్వస్థతకు గురైన విద్యార్థినులను.. తెదేపా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పరామర్శించారు. పాఠశాల హాస్టల్ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ పలువురు వాపోయారు. తమ ఇబ్బందులను చెబితే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరించడం దారుణమని.. రావి వెంకటేశ్వరరావు అన్నారు. పాఠశాల అధ్యాపకుల తీరు మారకుంటే తెదేపా ఆధ్వర్యంలో పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు.
సంబంధిత కథనం: