ETV Bharat / state

ఇసుక రీచ్​ కార్మికులను ఆదుకోండి

author img

By

Published : Aug 16, 2019, 5:51 PM IST

ఇసుక రీచ్​లపై ఆధారపడి బతికే కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని లారీ యజమానులను,కూలీలను ఆదుకోవాలని కోరారు.

ఇసుక రీచ్​లపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోండి
ఇసుక రీచ్​లపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోండి

ఇసుక రీచ్​ల్లో పనిచేసే కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడ ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో 70 రోజులుగా ఇసుక కొరతతో వేలాది కార్మికులకు ఉపాధి కరువైందని, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు-లారీలు ఇంటికే పరిమితమైయ్యాయని సంఘం ఆరోపించింది. ప్రభుత్వ చర్యలతో లారీ డ్రైవర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించిందని అసోసియేషన్ కార్యదర్శి సదాశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పుండుమీద కారం మాదిరి వాహనాలకు ఫైనాన్స్, పన్నులు, ఇన్సూరెన్స్​లు కట్టలేని పరిస్థితికి చేరుకున్నామని ఆక్రోశం వెలిబుచ్చారు. తక్షణమే ఇసుక రీచ్​లను పెంచి లారీలు-ట్రాక్టర్లకు అనుమతులిచ్చి వేలాది కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు'

Intro:నెల్లూరు జిల్లా తడ మండలం ఇరకం దీవి నుంచి భీమునివారిపాళెం రేవుకు బోటులో 40 మంది గ్రామస్థులు పులికాట్ సరస్సులో వస్తుండగా బోల్తా పడింది. ఉదయం స్థానికులు ప్రతిరోజూ లాగే బోటులో భీమునివారిపాళెం గ్రామానికి ఎక్కారు. పులికాట్ సరస్సులో సగం దూరం రాగానే బరువు ఎక్కువ కావడంతో బోల్తా కొట్టింది. దీంతో ప్రయాణికులు నీళ్ల పడిపోయి ప్రాణాపాయస్థితికి చేరుకున్నారు. గందరగోళం ఏర్పడింది అరుపులు కేకలు వేయడంతో వెనుకనే వస్తున్న బోటులో ని వారు చేరుకుని అందరనీ రక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘోర ప్రమాదం జరగకుండా బయట పడ్డారు. ఇరకం గ్రామ పంచాయతీ నుంచి భీమునివారిపాళెంకు దారి సదుపాయం లేక నీళ్ల లో రాకపోకలు సాగిస్తూ బోటు బోల్తా సంఘటన లు జరుగుతున్నాయి.
నోట్ విజువల్ ఫొటో ఈటీవీ వాట్సాప్ ద్వారా పంపాను గమనించగలరు.

Body:నెల్లూరు జిల్లా తడ

Conclusion:

For All Latest Updates

TAGGED:

krishna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.