ETV Bharat / state

రైతు కష్టం..వరుణార్పణం - కృష్ణా జిల్లాలో వర్షం

కృష్ణా జిల్లాలో అకాల వర్షానికి పొలాల్లోని పంటలు నేల వాలిపోయాయి.. చేతికొచ్చిన వరిపంట నీట మునిగింది. 3,200 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

rain effect on farmers
కృష్ణా జిల్లాలో నీట మునిగిన పంట
author img

By

Published : Apr 27, 2020, 9:44 AM IST

Updated : Apr 27, 2020, 10:27 AM IST

పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈదురు గాలులతో కూడిన వర్షానికి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 61 వేల హెక్టార్లకుపైగా దాళ్వా వరి పంట సాగవగా.. అన్ని ప్రాంతాల్లోనూ పొలాలు ఇప్పుడే కోత దశకు చేరుకున్నాయి. బందరు మండలంతో పాటు పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, కలిదిండి మండలాల్లో రైతులంతా వరి కోతలు ముమ్మరం చేశారు. కూలీలు పనులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కొన్ని ప్రాంతాల్లో వెనుకంజ వేయడంతో ఎక్కువగా యంత్రాలతోనే కోతలు కోయిస్తున్నారు. అలా కోసిన పంట పనలపై ఉండగా, మరి కొన్ని చోట్ల నూర్పిడి చేసిన ధాన్యం రాశులపై ఉంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పంటలన్నీ తడిసిపోయాయి. పలు చోట్ల కోత దశకు చేరుకున్న పంట కూడా నేలవాలిపోయింది. ముసునూరు, విజయవాడల్లోని మొక్కజొన్న పంట దెబ్బతింది.

3,200 హెక్టార్లలో పంటనష్టం..

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 3,200 హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీటిలో 2,500 హెక్టార్లకు పైగా నేలవాలగా 700 హెక్టార్లకుపైగా పనల దశలో ఉంది. విజయవాడ, పెడన, కంకిపాడు తదితర ప్రాంతాల్లోని ధాన్యం రాశులు వర్షానికి తడిసిపోయాయి.అవనిగడ్డ మండలంలో 50 శాతానికిపైగా మొక్కజొన్న రైతులు గింజలు యంత్రంతో ఒలిచి కళ్లాల్లో ఆరబెట్టగా శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పైన కప్పిన పరజాలు లేచిపోయి గింజలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* జిల్లాలో 1.5 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కృత్తివెన్ను మండలంలో 7.2, పెదపారపూడిలో 5.5, గుడివాడ 5.0, కలిదిండి 4.7, గన్నవరం 4.0, కైకలూరు 3.9, నూజివీడు 3.8, ముదినేపల్లి 3.7, బాపులపాడు 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కోడూరు, ముసునూరు, విస్సన్నపేట, పెడన, మచిలీపట్నం, మోపిదేవిలో 2 సెం.మీ. పైగా వర్షపాతం నమోదు కాగా చందర్లపాడు, జి.కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, తిరువూరు, నందిగామ, విజయవాడ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

ఇదీ చదవండి.. పాము విన్యాసం.. మనమూ చూసేద్దాం

Last Updated : Apr 27, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.