ETV Bharat / state

విమానాశ్రంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి.. విదేశాల నుంచి ఈ నెలలో 3 ప్రత్యేక విమానాలు రానున్నాయి. ఈ నేపధ్యంలో... ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ పరిశీలించారు.

author img

By

Published : May 20, 2020, 11:14 AM IST

krishna district collector visits gannavaram airport
గన్నవరం విమానాశ్రంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి విదేశాల నుంచి ఈ నెలలో 3 ప్రత్యేక విమానాలు రానున్న నేపధ్యంలో... అక్కడ ఉన్న పరిస్థితిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశిలించారు. ప్రయాణికుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక టెర్మినల్​, థర్మల్​ స్క్రీనింగ్ పరీక్షల కేంద్రాన్ని ఆయన పరిశిలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియా నుంచి ప్రత్యేక విమానం ఈ నెల 20న రాత్రి 10:15 గంటలకు విమానం చేరుకోనుంది. ఈ నెల 23న రాత్రి 10 గంటలకు సౌది అరేబియా నుంచే మరో విమానం గన్నవరానికి రానుంది. వివిధ దేశాల నుంచి దిల్లీ చేరుకున్న ప్రవాసాంధ్రులను తీసుకొని ఈ నెల 27న ఉదయం 11:30కు మరో విమానం చేరుకోనుంది.

వచ్చిన ప్రయాణికులకు వెంటనే నిబంధనల ప్రకారం.. వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులు ఎంపిక చేసుకున్న పెయిడ్ క్వారెంటైన్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రాణాలు తీసిన టిక్​టాక్..తల్లి ఆత్మహత్య..పురుగు మందు తాగిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.