ఉపాధి హామీ పనులతో ఎంతో మంది పేదల కళ్లల్లో సంతోషం వెల్లివిరుస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరును డ్వామా ప్రాజెక్టు అధికారితో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు 2 లక్షల 54 మందికి ఉపాధి కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఇంతవరకు రూ.118 కోట్లు వేతనాలుగా ఉపాధి కూలీలకు చెల్లించామని తెలిపారు.
ఈ ఏడాది లాక్ డౌన్ కారణంగా పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వారు సైతం ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద పంట కాలువలు, పంట బోదెలు తవ్వకాలు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో రైతులకు సాగునీరు పంటకాలువల ద్వారా త్వరగా చేరుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్: 'కాలాపానీ'పై రగడ ఏల?