బహిరంగ మల విసర్జన... ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ప్రజలు ఉండేలా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు రూపొందించిన ప్రచారరథాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. 60 రోజులపాటు ప్రతి రోజూ 3 గ్రామాల్లో పర్యటించి చైతన్యకార్యక్రమాలు చేపడుతుంది. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రథంలో ఎనిమిది లఘ చిత్రాలు ప్రదర్శిస్తారు. చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలనే విషయాన్ని తెలియజేస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా నిర్మించుకోలేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఇదీ చదవండి :