కృష్ణా జిల్లాలో సాగు చేస్తున్న మిర్చి పంటకు బొబ్బ తెగులు సోకింది. దీంతో అన్నదాతలు తీవ్రనష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని చందర్లపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో 25 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశారు. నెలరోజులుగా పంటకు బొబ్బ తెగులు సోకింది. ఈ తెగులు మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పైరును పూర్తిగా తొలగించాల్సి వస్తోంది. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
పంట పూత, పిందె దశలో ఉండగా పైరును పూర్తిగా తొలగించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వత్సవాయి మండలం భీమవరం, మాచినేని పాలెం, మంగోల్లు, మక్కపేట గ్రామాల్లో పదుల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు తొలగించారు. మరికొంత మంది తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు.
![krishna dist farmers problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vja-22-04-mirapa-panta-vyras-ap10047_04112020155234_0411f_01602_903.jpg)
ఇదీ చదవండి: రాజధాని రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి: ఏపీ రైతు సంఘం