విజయవాడ నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కల్యాణ మండపాలు, రెస్టారెంట్స్, హోటల్స్, దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందనీ.. దాని వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దీనికోసం మంగళ, బుధ, శుక్రవారాల్లో ప్రజలతో సమావేశమవుతామన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడకంలోకి తీసుకొస్తామని వివరించారు. కార్పొరేషన్, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. ప్లాస్టిక్ నివారణలో మీడియా, సామాజిక మాధ్యమాల సహకారం తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి..