పాము కరవడంతో 6వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగింది. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా హోటల్ నడుపుతున్న నాగుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కుమార్తె నాగ రమ్య (13)ను ఇంటిలో పాము కరిచింది.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా.. మెరుగైన చికిత్సలకు బందరు తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది.
ఇదీ చదవండి:
SUICIDE: వ్యక్తి ఆత్మహత్య.. 8 పేజీల సూసైడ్ నోట్లో కీలక విషయాలు?