కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు, రాష్ట్రాలు.. సర్వ శక్తులు వినియోగిస్తుండగా రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కరోనా సాయంగా అందాల్సిన వెయ్యి రూపాయలు.. కృష్ణా జిల్లాలో ఇంకా లక్ష 70వేల మందికి అందలేదన్నారు. రేషన్ దుకాణాల్లో సరఫరా చేసిన బియ్యం తినేందుకు యోగ్యంగా లేదని కొల్లు రవీంద్ర అన్నారు. కరోనా సహాయంగా జిల్లాకు 17 కోట్లను విడుదల చేయడంతోపాటు... గోదాముల్లో నిలువ ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో కరోనా వ్యాప్తిపై వినూత్న ప్రచారం