ETV Bharat / state

ఆసియాలోనే... అతిపెద్ద తాగునీటి సరస్సుకు ఇప్పుడేమైంది!?

చూడచక్కని ప్రకృతి అందాలు... దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పక్షుల కిలకిలారావాలు... నీరంతా పచ్చని తివాచీ పరచినట్టు విస్తరించిన గుర్రపు డెక్కలు... వాటి కిందనుంచి తుళ్లిపడే ఏటి చేపలు...  పట్టుకునేందుకు దోనెల్లో వెళ్లే పల్లె మత్స్యకారులు... ఎండిన కిక్కిసం దుబ్బులు... వాటిలో గూళ్లు కట్టుకున్న పిట్టలు..! ఇంతటి రమణీయత ప్రస్తుతం విషతల్యమవుతోంది.

ఆసియాలోనే... అతిపెద్ద సరస్సుకు ఇప్పుడేమైంది!?
author img

By

Published : Jun 14, 2019, 7:24 AM IST

కొల్లేరు... ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచం. భువిలో కొలువైన మరో భూతల స్వర్గం. అక్కడి ప్రతిదృష్యం ఓ కావ్యం. అయితే... ఇదంతా గతం. వేలాది రకాల జీవజాతులకు ఆలవాలమైన కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత జీవావరణం ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారుతోంది.

కరిగిపోతూ... కన్నీరు పెడుతూ...
ప్రకృతి అందాలతో, అలసిన మనసులకు ఆహ్లాదాన్ని అందించే విదేశీ పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే కొల్లేరు కరిగిపోతోంది. భవిష్యత్తులో కానరానంటూ కన్నీరు పెడుతోంది. ఖండాంతరాలు దాటి వొచ్చే విదేశీ అతిథులతో సందడి సందడిగా ఉండే కొల్లేరు సరస్సు ఇప్పుడు ఎడారి లా.. బురద నేలలా దర్శనమిస్తోంది. జనజీవితాలతో ముడిపడిన కొల్లేరు ఇప్పుడు తన ఉనికినే క్రమంగా కోల్పోతోంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కనిపించబోనంటూ హెచ్చరిస్తోంది.

అమృతమే.. విషతుల్యమై!
ఒకప్పుడు దోసిళ్లతో కొల్లేటి నీటిని తాగేవారు. అదే అమృతమని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ నీరే విషతుల్యమని భయపడుతున్నారు. అక్వాతోపాటు స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు ఇలా అన్నీ కలసి కొల్లేటిని కాలుష్య సరస్సుగా మార్చేస్తున్నాయి.

అతిపెద్ద సరస్సు... అంతరించిపోతోంది!
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేరు నేడు అంతరించిపోతోంది. ఒకప్పుడు పవిత్రతకు మారుపేరైన సరస్సు.. ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. ఆ నీటిలో వేలు ముంచినా వ్యాధులొస్తాయనే భయం ప్రజల్లో కలుగుతోంది. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు అంతరించిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. సరికొత్త ప్రభుత్వమైనా దీనిపై శ్రద్ధ వహిస్తుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది.

ఆసియాలోనే అతిపెద్ద సరస్సు బక్కచిక్కిపోతోంది. ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనమైన కొల్లేరు కళాహీనమవుతోంది. భువిలో కొలువైన మరో భూతల స్వర్గం కన్నీరోడుతోంది.

ఇదీ చదవండీ: ఆమిర్​ఖాన్​ కూతురు ఐరా డేటింగ్​. ఎవరితో?

Bishkek (Kyrgyzstan), Jun 13 (ANI): After Prime Minister Narendra Modi held bilateral discussions with Chinese President Xi Jinping on the sidelines of Shanghai Cooperation Organisation (SCO) Summit in Bishkek, the former noted that strategic communication between the two countries improved, which helped in resolving the listing of Jaish-e-Mohammed (JeM) chief's Masood Azhar as global terrorist, said the Ministry of External Affairs (MEA). "PM noted what had improved between two sides is strategic communication and in that context, we have been able to resolve long pending issues like opening of Bank of China branch in India and issue related to listing of Masood Azhar," said Vijay Gokhale, Foreign Secretary, MEA.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.